ఈ ఫ్లెక్సీ చూస్తుంటే ఏలూరు పోలీసులు నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తోంది. పాత నేరస్థుల ఫోటోలతో ...నేను ఎవరో మీకు తెలుసా?... అంటూ వేసిన ఈ వినూత్న పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పుడు ఆ ఫ్లెక్సీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. . !
" నేను ఎవరో మీకు తెలుసా?" – ఏలూరు పోలీసుల మైండ్ బ్లోయింగ్ ఐడియాతో దొంగలకు చుక్కలు చూపిస్తున్నారు పోలీసులు.. ఊరంతా పాత నేరస్థుల ఫోటోలతో ఫ్లెక్సీలు పెట్టి... జర జాగ్రత్త ..
వీళ్లు మీ చుట్టుపక్కలే ఉండొచ్చు అని ఏలూరు పోలీసులు నేరాలను అరికట్టేందుఉ వినూత్న ప్రచారం చేస్తున్నారు. ఇదంతా సినిమా రేంజ్‌లో పోలీసుల ప్లాన్ ఉంది కదా.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఫ్లెక్సీ సెన్సేషన్ అవుతోంది.
ఏలూరు జిల్లాలో ఇప్పుడు ఒక ఫ్లెక్సీ హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా రాజకీయ నాయకుల పుట్టిన రోజుకో లేక శుభాకాంక్షలు చెప్పడానికో ఫ్లెక్సీలు కడతారు. కానీ, ఏలూరు పోలీసులు మాత్రం నేరస్థుల గుండెల్లో వణుకు పుట్టించేలా ఒక వినూత్న ప్రయోగానికి తెరలేపారు. ..నేను ఎవరో మీకు తెలుసా?' అంటూ పాత నేరస్థుల ఫోటోలతో నగరంలోని ప్రధాన కూడళ్లలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నేరాలను అరికట్టడంలో ఏలూరు పోలీసులు స్టైలే వేరు. ఇళ్లల్లో దొంగతనం చేసేవారు, బైక్ దొంగలు, గొలుసు దొంగలు, అంతెందుకు ట్రాన్స్‌ఫార్మర్లలో కాపర్ వైర్లు దొంగిలించే వారి ఫోటోలను కూడా సేకరించి.. వారి పేర్లు, ఊర్ల వివరాలతో సహా ఈ ఫ్లెక్సీలో ప్రదర్శించారు. 'వీరు మీ కంటపడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి' అని పరోక్షంగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ వినూత్న ఆలోచనతో నేరస్థులు బయట తిరగాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ ఫ్లెక్సీని చూసిన జనం.. 'పోలీసుల ఐడియా అదుర్స్' అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు
